ఆనంద్ దేవరకొండ “గం.. గం.. గణేశా” టీమ్ అవకాశాలు

తెలుగు తెరపై నటీనటులుగా స్థిరపడాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “గం..గం..గణేశా” టీమ్. టాలెంట్ ఉన్నవారికి నిజాయితీగా అవకాశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది “గం..గం..గణేశా” చిత్రబృందం 25 నుంచి 55 ఏళ్ల వరకు వివిధ పాత్రల కోసం నటులు, 18-20 ఏళ్ల ఒక పాత్రకు నటికి అవకాశం ఉంది. ఈ పాత్రలకు కావాల్సిన రిక్వైర్ మెంట్స్ ప్రకటనలో తెలిపారు. ఫొటోలు, వివరాలు uditions.gamgamganesha@gmail.com అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు. 7893058310 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు. ఫిల్టర్ ఫొటోస్, టిక్ టాక్ వీడియోస్ పంపవద్దని, ఫోన్ కాల్స్ చేయొద్దని టీమ్ పేర్కొంది.

ఇటీవలే “గం..గం..గణేశా” చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

Anand Devarakondagam gam Ganesha Team
Comments (0)
Add Comment