విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమాను రూపొందించాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాకి, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక విలేజ్ స్థాయి నుంచి బాక్సర్ గా ఎదిగిన కుర్రాడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు.
ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటిక్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ పాత్రలోని వేరియేషన్స్ ను .. అతను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు. అందుకోసం ఎదుర్కున్న పరిస్థితులపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
విజిట్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ పోషించిన మాస్ రోల్ మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన మైక్ టైసన్ కూడా ట్రైలర్ లో మెరిశాడు. అనన్య పాండే కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, మకరంద్ దేశ్ పాండే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.