సీఆర్‌కి ఎందుకు ఇంత అహంకారం? రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా?: బండి సంజయ్

  • తెలంగాణలోని అన్ని కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకం
  • తెలంగాణరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 3: సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని… తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేసీఆర్ తీరును తెలియజేశామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలోని అన్ని కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కి ఎందుకు ఇంత అహంకారం? రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా? పంచతీర్దాల పేరుతో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలు ఏర్పాటు చేశాం.

కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? సచివాలయం వద్దు గడీలు కట్టుకోవాలని అనుకుంటున్నారా..? కేసీఆర్‌కి బుద్ధి ఉందా? కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించొద్దు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. దళిత సమాజాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్. రాజ్యాంగం పక్కన పెట్టి.. కల్వకుంట్ల రాజ్యాంగం ఉండాలి. తన విగ్రహాలు పెట్టాలని కేసీఆర్ అనుకుంటుండు. బ్రిటిష్, నిజాం పాలన చూశాము. అదే విధంగా మిమ్మల్నీ తరిమి కొడతాం’’ అని హెచ్చరించారు.

Bjp Leader Fire On KcrConstitutionkcr comments on democracyrewrite the Constitution of India
Comments (0)
Add Comment