జగ్గయ్యపేట
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రాష్ట్ర జిల్లా స్థాయిలో స్వీప్ కోర్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్, సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డిప్యూటీ చీప్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరావు ను రాష్ట్ర సచివాలయంలో కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కమిటీల యొక్క ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల సమన్వయంతో ఎన్నికల నిఘా వేదిక గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యాసంస్థల్లో ప్రధానంగా విశ్వవిద్యాలయాలు కళాశాలలో ఎలక్ట్రోలర్స్ లిటరసీ క్లబ్స్ ఏర్పాటుకు నిఘా వేదిక సహకరించినట్లు ఆయన తెలిపారు. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (SVEEP) క్రమబద్ధమైన ఓటర్ల విద్య ఎన్నికల భాగస్వామ్యం పై ప్రజల్లో చైతన్యం నిరంతర కార్యక్రమమని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల సమన్వయంతోనే త్వరతగతిన ప్రజాస్వామ్య ఫలాలను పొందవచ్చునని ఆయన అన్నారు. ఎన్నికల నిఘా వేదికరాష్ట్ర కో కన్వీనర్స్ మొగులూరు నాగేశ్వరరావు ఒంగోలు, మోత్కూరు వెంకటేశ్వరరావు విజయవాడ, మహమ్మద్ బాజీ తదితరులు సీఈఓ ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.