_*సంక్షేమంతో పాటు పల్లెలో మెరుగు పడుతున్న రోడ్లు – ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను*._
జగ్గయ్యపేట. ………….
_రాష్ట్రంలో సంక్షేమంతో పాటే అభివృద్ధి సమాంతరంగా పరుగులు పెడుతుంది అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు మంచి రోడ్డు వసతి లేని వందల గ్రామాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహదారులను అందుబాటులోనికి తీసుకువస్తున్నారు మరియు అవసరమైన చోట యుద్ద ప్రాతిపదికన మరత్తులను చేపట్టారు.ప్రత్యేక కృషితో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని శివాపురం నుండి అనిగండ్లపాడు రోడ్కు రూ30 లక్షలు,అనిగండ్లపాడు నుండి గుమ్మడిదుర్రు రోడ్ కు రూ 15 లక్షలు,అదేవిదంగా వత్సవాయి నుండి వేమవరం రోడ్ కు మరో రూ 30 లక్షలు,అత్యవసర మరమత్తుల నిమిత్తం మొత్తం రూ 75 లక్షల మంజూరు చేయించి టెండర్లు పిలిపించి పనులు ప్రారంభించడం జరుగుతుంది అన్నారు.,అదేవిధంగా జగ్గయ్యపేట వైఎస్ఆర్ విగ్రహం నుండి చిల్లకల్లు వరకు విస్తరణ లో భాగంగా వరకు రూ.14 కోట్ల మంజూరు చేయించి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి,మరమ్మతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు._