షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన వైఎస్ఆర్ యువజన నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

_
షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన
వైఎస్ఆర్ యువజన నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

జగ్గయ్యపేట పట్టణం మున్సిపల్ ఇండోర్ స్టేడియం నందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరిగే షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడడం ద్వారా శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు,విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను కూడా అలవాటు చేసుకోవాలని క్రీడల ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని తెలిపారు,నేడు మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలు ముందుకు వెళ్తున్నారని అన్నారు,క్రీడల్లో మంచి విజయం సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు కూడా లభిస్తాయి తెలిపారు._

_ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,కౌన్సిలర్లు వట్టెం మనోహర్,దువ్వల రామకృష్ణ,పెనుగంచిప్రోలు మండల సచివాలయాల కన్వీనర్ కనమల శామ్యూల్,స్పోర్ట్స్ కన్వీనర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు._

Comments (0)
Add Comment