తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు
జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తె.దే.పా నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు
*ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ*
తెలుగు ప్రజల ఆరాధ్యదైవంస్వర్గీయ నందమూరి తారకరామారావు ఒక మహా నటుడిగా, ఒక మహా నాయకుడిగా తెలుగు ప్రజల
నీరాజనాలందుకున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆరు దశాబ్దాల సుదీర్ఘ
నట ప్రస్థానంలో ఎదురు లేని రారాజుగా వెలుగొందారన్నారు.
రాముడు, కృష్ణుడిగానే కాకుండా రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు,
రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి ఆయా పాత్రలకు వన్నె తెచ్చారు.సమాజమే దేవాలయంగా, పేదప్రజలను దేవుళ్లుగా తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా యుగపురుషుడుగా ఎన్టీఆర్ చచరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. కిలో రెండు రూపాయలు బియ్యం పథకం, పక్కా ఇళ్లు, చేనేత వస్త్రాలు, వితంతువులకు,కూలీలకు పింఛన్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆది గురువన్నారు. రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చేందుకు తెలుగు గంగ, ఆడపడుచులు ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయం, ప్రజా సదస్సులు, సింగిల్ విండో విధానం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, ప్రధానంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ప్రజల వద్దకే పాలన రావాలి, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి. స్థానిక సంస్థలు బలోపేతం కోసం మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. అదే బాటలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు అదే విధమైన పరిపాలన కొనసాగించారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ గెలుపు కోసం మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి ఒక్కరూ విరామం లేని పోరాటం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, వార్డు కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు