మంత్రుల ఆదేశాలతో ఇచ్చిన హెచ్ ఎం.ధనలక్ష్మి బదిలీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు.. నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.

*మంత్రి విడదల రజనీ,మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలను ఆధారంగా చేసుకుని ఇచ్చిన హెచ్ ఎం.ధనలక్ష్మి బదిలీ ఉత్తర్వులు నిలిపివేసిన హైకోర్టు.. నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.*

*చిలకలూరిపేట శ్రీశారదాజిల్లాపరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి పై మరొకసారి శాఖా పరంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ 12.02.2022 విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కు ఫిర్యాదు చేశారు.వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స గతంలో చేసిన ఫిర్యాదు విచారణ పెండింగ్ లో ఉన్నప్పటికీ తక్షణమే ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి ని దూరంగా బదిలీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశిస్తూ రాసిన లేఖ ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు విచారణ 10.01.2023 నిర్వహించారు.అయితే ఈ ఉత్తర్వులు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 18.01.2023 ఉత్తర్వులు జారీ చేసినట్లు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. గిరిజన మహిళా ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి పై గతంలో కూడా ఇదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అసత్య ఆరోపణలు ఆధారంగా లేఖలు రాశారు అని ,ఆలేఖలు ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం అలవాటుగా మారిపోయింది అని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.కొత్త సంవత్సరంలో 2023 జనవరిలో మరలా చిన్న స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి పై ఉన్నత స్థాయి లో ఉన్న ఇద్దరు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజనీ ఈవిధంగా కక్ష సాధింపునకు దిగడం మంచిది కాదని హితవుపలికారు. గిరిజన మహిళ అనికూడా చూడకుండా గతంలోనే ఒకసారి ఆమెను మంత్రి విడదల రజనీ సస్పెండ్ చేయించారని,మరొక్కసారి ఆమె అధికారాన్ని లాక్కుని మంత్రి రజనీ బంధువు అయిన అగ్రవర్ణ ప్రధానోపాధ్యాయురాలికి కట్టబెట్టారని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే చట్టప్రకారం కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 2023 జనవరిలో అనధికార విధానాన్ని అమలు చేయాలని చూసిన మంత్రులు విడదల రజనీ, బొత్స సత్యనారాయణ ఆదేశాలను 18.01.2023 న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది మీడియా కు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం 21.01.2023 సోమవారం తెలిపారు. నవతరంపార్టీ నుండి బాధిత గిరిజన మహిళా ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి కి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం నుండి అన్నీ వర్గాలు వేధింపులు చవిచూస్తున్నాయని భాదితులకు నవతరంపార్టీ అండగా ఉంటుందని తెలిపారు.అధికారం ఉంది ప్రజలకు మంచి చేయడానికి అని,కానీ ఇలా వేధింపుల కోసం కాదని,ఇలా చేస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని అన్నారు.మీ చేతిలో అధికారం ఉంటే మా చేతిలో న్యాయం ఉందని అన్నారు. హైకోర్టులో ఇలాంటి పనులు చేస్తూ ప్రభుత్వం ముద్దాయిగా నిలబడటం అలవాటు గా మారిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిరోజూ హైకోర్టు అక్షింతలుతో కాలం గడుపుతుంది అని రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు.*

Comments (0)
Add Comment