పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించిన చంద్రబాబు

చిత్తూరు జిల్లా…కుప్పం నియోజకవర్గం.గుడిపల్లిలో టీడీపీ అధినేత బైఠాయింపు..తన పర్యటనలో పోలీసుల ఆంక్షలపై నిరసన తెలియజేశారు

ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు

గుడిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు మాట్లాడుతూ గుడిపల్లికి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారా?
టీడీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెడతారా?
బానిసలుగా బతకొద్దని పోలీసులకు సూచిస్తున్నా..
నన్ను పంపివేయాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తా అంటూ మండిపడ్డారు
ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు
వైసీపీ నేతలు రోడ్డుషోలు, సభలు పెట్టొచ్చ కానీ మేము పెట్టకూడదా? అన్నారు
వైసీపీ వాళ్లకు ఒక రూలు.. మాకో రూలా? – ప్రజాహితం కోసమే నా పోరాటం నన్ను ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ప్రజలే నా వెంట ఉండి ముందు నడిపిస్తారు అన్నారు

Comments (0)
Add Comment