జీవితంలోని సవాళ్ళలను అధిగమించడానికి ధ్యానం సహాయమ్ – ప్రభుత్వవిప్ సామినేని

జీవితంలోని సవాళ్ళలను అధిగమించడానికి ధ్యానం సహాయపడుతుంది – ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట పట్టణం చెరువు బజార్ రోడ్డు బుద్ధ విహార్ పార్క్ నందు గౌతమ బుద్ధ ధ్యాన కేంద్ర నిర్మాణనికి మంగళ వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను హిమాలయ యోగి సంపత సదానంద గిరి మహారాజ్ కలసి శంకుస్థాపన చేశారు.ఈ సంద్భంగా ఉదయభాను మాట్లాడుతూ నేటి సమాజంలో ధ్యానం ద్వారానే మంచి శరీరం,మంచి మనస్సు,ఆత్మసాక్షాత్కారం అనే అంతిమ లక్ష్యాన్ని మనుషులు సాధించగలరు అని అన్నారు,ఈ రోజు ప్రజలు జీవితంలో అనేక రకాల ఒత్తిడి,ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒత్తిడిని ఎదుర్కోవడానికి , జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ధ్యానం సహాయపడుతుంది అని అన్నారు,నేను కూడా రేపటి నుంచి ఉదయానే కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తానని తెలిపారు._
అలాగే ఈ బుద్ధ విహార్ ఉన్న చెరువును సుమారు 5 కోట్ల రూపాయలతో చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి గ్రీనరీ,లైట్లు తో మంచి పర్యాటక కేంద్రంగా ఊరా చెరువును అభివృద్ధి చెయ్యడం జరుగుతుందని అన్నారు.

_ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,కౌన్సిలర్ వట్టెం మనోహర్,గింజుపల్లి వెంకటరామయ్య,కో ఆప్షన్ ఖాదర్ బాబు, తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ పసుపులేటి రాధా సుబ్రహ్మణ్యం,లాయర్ సత్య శ్రీనివాస్,ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు, తమ్ముండ్రు నాగేశ్వరరావు, మీసాల బాలాజీ,మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు._

Comments (0)
Add Comment