చంద్రబాబు సభల్లో జరిగిన సంఘటనల మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు. శ్రీరామ్ తాతయ్య

చంద్రబాబు సభల్లో జరిగిన సంఘటనల మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు. శ్రీరామ్ తాతయ్య

నిజంగా ఆ సంఘటనలు బాధాకరం మా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మరణాలు మమ్మల్ని తీవ్రంగా కలచవేసింది ఆ కుటుంబాలకు ఎలా న్యాయం చేయాలో మాకు తెలుసునని పట్టణంలో వారి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశం లో శ్రీరాం తాతయ్య తెలిపారు. కానీ ఆ మరణాల మీద కూడా స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు రాజకీయం చేయడం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు, కారణం తండ్రి శవం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికోసం సంతకాలు చేయించుకుని పదవి దక్కకపోతే అప్పుడు పుట్టిన పార్టీ ఈ వైసీపీ.ఒక సొంత బాబాయి హత్యను అలాగే సొంత తల్లిని,చెల్లిని, రాజకీయంగా వాడుకున్న నీచ చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది అటువంటి నాయకత్వంలో పనిచేసేవాళ్ళు మీలాగే మాట్లాడతారు.. ఎవరిది ప్రచార ఆర్భాట పిచ్చి అనేది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసుకున్నారు, తండ్రి చనిపోతే సొంత కుటుంబ వ్యక్తులకు ఒక్కరికీ కూడా కనీసం జ్వరం రాలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది చనిపోయారని కుటుంబానికి లక్ష సాయం ఇవ్వడానికి రోజుకు 50 లక్షలు ఖర్చు పెట్టీ ఓదార్పు యాత్ర చేసిన జగన్ రెడ్డిది ప్రచార పిచ్చి అంటే.. ప్రతిపక్షంలో ఉన్నపుడు పాదయాత్ర చేస్తే అప్పటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ ఏ ఇబ్బందీ కలగకుండా సరైన పోలీసు రక్షణ కల్పిస్తే పాదయాత్ర చేశాడు మీ నాయకుడు అది గుర్తు పెట్టుకోవాలి కాదు మీలాగే నీచ రాజకీయాలు చేస్తే ఆ రోజు ఇంట్లో నుండి కాలు బయట పెట్టేవాడా అని సూటిగా అడుగుతున్నా… సభకు అనుమతులు ఇచ్చినపుడు పోలీసు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద వుంది. సంక్షేమ పథకాల మీద అంటే నమ్మకం ఉన్నపుడు మీ నాయకుడిని పరదాలు లేకుండా బయట తిరగమనండి మీరు గడప గడపకు పోలీసులు లేకుండా అధికారులు లేకుండా గడప గడపకి తిరగండి ఇది ఛాలెంజ్,
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి ఈ విషయం ప్రమాణ స్వీకారం రోజే ప్రకృతి చెప్పింది. గత 3.5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏలినాటి శని తో బాధపడుతున్నారు… గత 3.5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి పరిపాలనలో ఆత్మహత్య లు చేసుకున్న రైతులు, దాడులకు గురి అయిన మహిళలు వీరి ఉసురు ఎక్కడికీ పోదు. జగన్ రెడ్డి చేసిన పాపాలకు ఎమ్మెల్యే లు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు ..ప్రజల్లో వచ్చిన మార్పు చూసి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుంది మీకు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా మీ పార్టీ బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు
ఈ కార్యక్రమంలో మేకా.వెంకటేశ్వర్లు, కన్నెబోయిన రామలక్ష్మి, గట్టిడి.దుర్గాప్రసాద్,కానూరి కిషోర్, మైనేని రాధాకృష్ణ, దుళ్ళిపాళ్ళ.లక్ష్మణరావు, కౌన్సిలర్లు పేర0 సైదేశ్వరరావు, గొట్టే నాగరాజు, సంగేపు బుజ్జి, ఇర్రి నరసింహారావు, నకరికంటి వెంకటి, తెదేపా నాయకులు దర్శి నరసింహారావు, గుమ్మా మధు, గుడారు నాగార్జున, ఇమ్మడి.వెంకటేశ్వరరావు,ఇమ్మడి.శివ, గుడారి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment