గాంధీజీ శాస్త్రీజీ జయంతి ఘనంగా నిర్వహించిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం.

మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి ఆశయాలు ప్రతిఒక్కరూ కొనసాగించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.గుంటూరులో మునిసిపల్ కార్యాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి,సంగడిగుంటలో గల మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి జయంతి సంధర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో యువజన విభాగం నేత వెల్లాల సాయి సుబ్రహ్మణ్యం రాజు ఆద్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో నవతరంపార్టీ నేతలు షేక్ రజాక్,ఉప్పుతల ప్రసాద్,కొడాలి శివ,తమ్మిశెట్టి సురేష్,ఆర్యవైశ్య సంఘం నాయకులు గ్రంధి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు*

Comments (0)
Add Comment