రానున్న ఎన్నికల్లో మరల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

_*రానున్న ఎన్నికల్లో మరల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట

రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడానికి ప్రజాప్రతినిధులు ముఖ్యనేతలు కృషి చేయాలని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు,జగ్గయ్యపేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్డు శుభమస్తు కళ్యాణ మండపంనందు నియోజకవర్గ వైయస్సార్సిపి ముఖ్య నేతలతో మరియు నూతనంగా నియమించిన సచివాలయ కన్వీనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు._

_ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను మరియు తనయులు నియోజకవర్గ వైసిపి యువజన నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు,నియోజకవర్గ పరిశీలకులు నూతలపాటి హనుమయ్య పాల్గొన్నారు._

_ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు,రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు కుట్రలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారని వాటిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు సైనికుల పనిచేయాలని అన్నారు.మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి గ్రామస్థాయిలో ప్రజలకు నాయకులు,ప్రజాప్రతినిధులు వివరించాలని కోరారు._

_అదేవిధంగా శ్రుక వారం నూతనంగా నియమించిన పట్టణ,మండల కన్వీనర్లుగా జగ్గయ్యపేట పట్టణానికి తుమ్మేపల్లి నరేంద్ర ,జగ్గయ్యపేట మండలానికి దొంగల జానకి రామయ్య ,వత్సవాయి మండలానికి చింతకుంట్ల వెంకటరెడ్డి ,పెనుగంచిప్రోలు మండలానికి కన్నమాల శామ్యూల్ ,ఏటుపట్టు గ్రామాలకు దేవినేని నాగేశ్వరరావు నియమించడం జరిగిందని తెలిపారు._

_పట్టణ,మండల, కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు కలసి వాలంటీర్ కు ఇద్దరు చెప్పిన సమర్థవంతంగా పనిచేసే గృహసారధులను నియమించాలి అని తెలిపారు.వీరందరూ వార్డు, గ్రామాలలో ఉన్న ప్రజలతో మమేకమవుతూ వారి సాధక బాధకాలను తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు,రాబోయే ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

_ఈ సందర్భంగా హనుమయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేస్త ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి ని,ఇక్కడ ఉదయభాను గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు._

_ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు,మార్కెట్ యార్డ్ చైర్మన్ ముత్తినేని విజయ శేఖర్,మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీలు,జడ్పిటిసిలు,ఎంపీటీసీలు సర్పంచులు,సొసైటీ అధ్యక్షులు,పార్టీ సీనియర్ నాయకులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._

Comments (0)
Add Comment