ఎన్టీఆర్ జిల్లా
జగ్గయ్యపేట
భీమవరo టోల్గేట్ దగ్గర్లో ట్యాంకర్ను ఢీకొన్న కారు సమయానికి స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అంబులెన్స్లు ఏర్పాటు చేసిన శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న కారు భీమవరం టోల్గేట్ దాటిన తర్వాత రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గరలో యూటర్న్ తీసుకుంటున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో ప్రమాదవశాత్తు అందులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగినవారు గుడివాడ దగ్గరసేరి కల్వపురి గ్రామానికి చెందిన దివి శ్రీనివాసచారి,దివి శేషాచారి,వరలక్ష్మి,శ్రుతి,వాణి ,రాజ్యలక్ష్మి పెద్దరాజు,దినకర్లుగా గుర్తించడం జరిగింది.ఆ సందర్భంలో జగ్గయ్యపేట పట్టణమ్నకుచెందిన మూర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కి ఫోన్ ద్వారా సమాచారం తెలుపుగా వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని వారి సొంత అంబులెన్స్,రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ అంబులెన్స్ జిఎంఆర్ టోల్ ప్లాజా వారి అంబులెన్స్,ఇతర వాహనంలో మాట్లాడి పేషంట్లను హుటాహుటిన మెరుగైన వైద్యంకొరకు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.
సమయానికి స్పందించి వెంటనే అంబులెన్స్ ఏర్పాట్లు చేసినందుకు విలేకర్ మూర్తి శ్రీరాo రాజగోపాల్ తాతయ్య కి కృతజ్ఞతలు తెలిపారు.