నారా లోకేష్ పాదయాత్ర విజయవంతానికి కర్నూలు నగరంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కర్నూలు పార్లమెంట్ పరిధిలో పలు దేవాలయాలలో పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
టీ ఎన్.టి.యు.సి అధ్యక్షులు వై.నరసిమ్హులు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వినాయకుడి గుడి నందు వినాయకుడికి మరియు సాయిబాబ దేవుళ్ళకు ప్రత్యేక పూజలు మరియు
కర్నూలు పార్లమెంట్ బి.సి సెల్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు ఆధ్వర్యంలో శ్రీ క్రిష్ణాలయం నందు ప్రత్యేక పూజలునిర్వహించారు.

ఇట్టి పూజా కార్యక్రమాలలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి టి.జి.భరత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment