హైదరాబాద్, ఫిబ్రవరి 9: పగటి కలగానే మిగిలిపోతుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనను స్వీకరించేందుకు ప్రాతీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు సిద్దంగా లేరా? కేసేఆర్ బీజేపీతో చేస్తోంది, షాడో ఫైట్’గానే జాతీయ, ప్రాతీయ పార్టీలు భావిస్తున్నాయా? అంటే అవునాననే సమాధానమే వస్తోంది.అదే అభిప్రాయం మరింత స్పష్టంగా చెప్పారు సిపిఐ సీనియర్ నాయకుడు కే. నారయణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ నమ్మదగిన నాయకుడు కాదు, ఆయన్ని మాపార్టీ నమ్మదు. ఒకప్పుడు మేము ఫోన్ చేసినా పలకలేదు. ఇప్పుడు ఆయనే ఫోనేచేసి పలకరించాలను కుంటున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. అయితే, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ఎత్తుగడతోనే ఆయన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అంటున్నారు, కేసేఆర్ జాతీయ మంత్రం లక్ష్యం అదే, అందుకే కేసేఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన సిపిఐకి ఆమోదయోగ్యం కాదు, అని నారాయణ స్పష్టం చేసారు.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ వచ్చిన సిపిఐ, సిపిఎం నాయకులకు విందు ఇచ్చారు.
ఈసందర్భంగా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో, జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. అయినా, కేసీఆర్’ నమ్మలేమని, అందుకే కేసేఆర్ ప్రతిపాదిచిన థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను సిపిఐ సీరియస్’ గా తీసుకోలేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక థర్డ్ ఫ్రంట్ అంటూనే, కేసీఆర్ కాంగ్రెస్ అనుకూల పార్టీలు, ముఖ్యమంత్రులతోనే చర్చలు జరుపుతున్నారని, బీజేపీ అనుకూల ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు, ముఖ్యమంత్రులతో మంతనాలు సాగించడం లేదని అన్నారు. అంటే, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే కేసీఆర్ లక్ష్యమని నారాయణ విశ్లేషించారు. అలాగే, ఓ వైపు ప్రధాని మోదీని వ్యతిరేకించినట్లే కనిపిస్తున్నా.. అదే సమయంలో మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కూడా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉందని నారాయణ అన్నారు. ఓ వైపు బీజేపీని రెచ్చగొడుతూ.. మరోవైపు ఎంఐఎంని అడ్డం పెట్టుకుని జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేసీఆర్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
విధంగా కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్లి బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నది సీపీఐ ఆలోచన అని తెలిపారు.అంటే,తెలంగాణలోనూ సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని సంకేతాన్ని నారాయణ ఇచ్చారు. తెలంగాణలో కావాలనే కేసీఆర్ బీజేపీని కెలికి, ఆ పార్టీకి పరోక్షంగా మేలు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. నిజానికి, ఒక సిపిఐ మాత్రమే కాదు, జాతీయ, ప్రాంతీయ పార్టీలలో, ఏ ఒక్క పార్టీ కూడా కేసీఆర్’ ను నమ్మే పరిస్థితి లేదని, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అందుకే జాతీయ స్థాయిలో తనకు ఒక గుర్తింపు కలిపించెందుకే, కేసీఆర్ ప్రశాంత్ కిశోర్’ను ఎంగేజ్ చేసుకున్నారని విశ్లేశకులు అంటున్నారు. అంతే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేకుండా, మూడో ఫ్రంట్ ఏర్పడినా ఫలితం ఉందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహా అనేక మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కలిసిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటుకు సుముఖంగా లేరని తెలిపోయింది.ఇప్పటికే తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీయన్ పట్నాయక్ కేసీఆర్ ప్రతిపాదనకు నో. చెప్పారని అంటున్నారు. అదే విధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా చేయి వదిలే పరిస్థిత లేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం పగటి కలగానే మిగిలి పోతుందని పరిశీలకులు అంటున్నారు.