క్రిమినల్ కేసుల నేతలకే పెద్ద పీట

లక్నో, ఫిబ్రవరి 9: ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజకీయల్లో నీతివంతులైన నాయకులు ఉండాలన్నది నియమం. కానీ నేటి రాజకీయాలు మరోలా ఉన్నాయి. అయితే.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రపై ‘ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్'( ఏడీఆర్) ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఉతర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మొత్తం దేశంపైనే ప్రభావం చూస్తాయి. అక్కడ విజయం సాధించిన పార్టీ దేశ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నది అందరికి తెలిసిన సత్యం. అయితే ఆ రాష్ట్రంలో ఎన్నిక వేడి ఇప్పటికే తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే తొలి విడత ప్రచారం హాట్ హాట్‌గా సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో చాలా మంది నేర చరిత్ర కలిగనవారని ఓ నివేదికను ఎన్నికల సంస్కరణల అడ్వకేసీ గ్రూప్ ‘ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ ( ఏడీఆర్) విడుదల చేసింది. వీరు విడుదల చేసిన తాజా నివేదికలో చాలా ఆస‌క్తి క‌ర అంశాలు క‌నిపించాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ అభ్యర్థుల్లో 25 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడిచింది ఏడీఆర్.వీరిలో 12 మంది మహిళలపై నేరాలకు పాల్పడ్డారని.. ఆరుగురిపై హత్యకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. 615 మంది అభ్యర్థులలో 156 (25 శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించగా.. 121 (20 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాల నుంచి 615 మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల స్వీయ అఫిడవిట్‌లను విశ్లేషించినట్లు చెప్పింది ఏడీఆర్. ఈ స్థానాలకు ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. వారిలో ఎనిమిది మంది అఫిడవిట్‌లు స్కాన్ చేయకపోవడం లేదా అసంపూర్తిగా ఉన్నందున వాటిని విశ్లేషించలేమని ఏడీఆర్ చెప్పడం విశేషం.

ప్రధాన పార్టీలలో 28 మంది అభ్యర్థుల్లో సమాజ్‌వాదీ పార్టీ (SP), 21 (75 శాతం), రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) 17 (59 శాతం) అభ్యర్థులు 29 మంది అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ (BJP) 57 మంది అభ్యర్థులు ఉన్నారని ఎడిఆర్ తెలిపింది. ఎనిమిది మంది (15 శాతం) శాతం మంది తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులను అఫిడవిట్‌‌లో వెల్లడించారు. ప్రధాన పార్టీల్లో ఎస్పీ నుంచి 28 మంది అభ్యర్థుల్లో 17 మంది (61 శాతం), ఆర్‌ఎల్‌డీ నుంచి 29 మంది అభ్యర్థుల్లో 15 మంది (52 శాతం), బీజేపీ నుంచి 57 మంది అభ్యర్థుల్లో 22 మంది (39 శాతం), 58 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఏడీఆర్ తమ నివేదికలో పేర్కొంది. కాంగ్రెస్ నుంచి 11 (19 శాతం), 56 BSP అభ్యర్థులలో 16 (29 శాతం), 52 AAP అభ్యర్థులలో ఐదుగురు (10 శాతం) తమపై “తీవ్రమైన క్రిమినల్ కేసులు” అఫిడవిట్‌లో ప్రకటించుకున్నారు. అయితే ఇందులో “మహిళలపై నేరాలకు” సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లుగా 12 మంది అభ్యర్థులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వారిలో ఒకరిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు (IPC సెక్షన్ 376) ఉన్నట్లుగా అఫిడవిట్‌లో ప్రకటించుకున్నారు.

leaders of criminal cases
Comments (0)
Add Comment