శ్రీశైలంలో 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు నల్లమల అడవుల నుంచి కాలినడకతో శ్రీశైలం వచ్చే భక్తులకు శివస్వాములకు ముఖ్యంగా ప్రాదాన్యతనిచ్చామని ఈఓ లవన్న తెలిపారు. నల్లమలలోని పెద్దచెరువు, నాగలూటి, వెంకటాపురం, బీమునికొలను వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 22 నుంచి మార్చి 4 వరకు స్వామివారి అన్ని సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. రెండు వందల రూపాయల టికెట్ల ఉచిత దర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని అయన వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకొని, కొవిడ్ నిభందనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వికలాంగులకు, వృద్దులకు, చంటిబిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక లడ్డు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈఓ పేర్కొన్నారు.

Mahashivaratri BrahmotsavamSrisailam
Comments (0)
Add Comment