కరోనా వారియర్స్ అవార్డు గ్రహీత కు సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో శ్రీ రేణుక దేవాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్య వైశ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పశుపునూరి వీరేశం, ఆలేరు ఆర్య వైశ్య టౌన్ అధ్యక్షులు అయిత వెంకటేశ్వర్లు పాల్గొని రేణుకా మాత కి ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వంగపల్లి ఆంజనేయ స్వామి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వాళ్లు చేసిన సేవ కార్యక్రమలకు గాను మరియు ఆలేరు పట్టణంలో స్థానిక ప్రజా సమస్యలపై అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించినందుకు గాను ద లీడర్స్ పేజీ హైదరాబాద్ సంస్థ వారు స్పందించి కరోనా వారియర్ అవార్డు మరియు పొలిటికల్ బయోడేటా రెండు అవార్డులు పొందిన పశుపునూరి వీరేశం కి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు బచ్చు గణేష్ విజయ, బుస్సా నాగభూషణం నవీన్ కళా, పాపిశెట్టి శ్రీనివాస్, పాపిశెట్టి పవన్ తదితరులు పాలొగొన్నారు.

Leave A Reply

Your email address will not be published.