ముక్కోటి ఉత్సవాలలో పాల్గొన్న టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

ముక్కోటి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
సద్గురు శ్రీ శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో, బలుసుపాడు శ్రీ గురుదమ్ వ్యవస్థాపకులు సాత్వికులు శివశ్రీ గంట్యాల వెంకటరమణ వసంత లక్ష్మి దంపతుల ఆశీస్సులతో
జగ్గయ్యపేట పట్టణం ఆర్యవైశ్య యువజన సంఘం మరియు షరాబు వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో భగవద్రామానుజ గోష్టి వ్యవస్థాపకులు డాక్టర్ టి.ఎల్.ఎన్ ఆచార్యులు మరియు వేద పండితులు ఆర్యవైశ్య పురోహితులు బ్రహ్మశ్రీ పిల్లలమర్రి నాగ కృష్ణ శర్మ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జగ్గయ్యపేట పట్టణం బంగారు కోట్ల సెంటర్లోని శ్రీ స్వయంభు విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఈరోజు నుంచి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొఠాయి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం మరియు షరాబు వర్తక సంఘం సంయుక్త సభ్యులతో కలిసి టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, శ్రీరాం సుబ్బారావు, శ్రీరాం రామకృష్ణ, కొంకిమళ్ళ మల్లు, కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో నూకల మురళీ, చింతా శేషానందం, యర్రం శివ, నూకల బాలకృష్ణ, శ్రీరాం జయరాం, గుండా మోహన్, శ్రీరాం లాలు, మానేపల్లి రాజేష్, చల్లా సత్యనారాయణ, కొప్పు సుధాకర్, గెల్లా రాము తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.