Home AP వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు-.ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు-.ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

13
0

AP 39TV 15 ఫిబ్రవరి 2021:

నార్పల మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మనీలా సుప్రియ  ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి  మరియు అనంతపురం ఎన్నికల పార్లమెంట్ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి మనీలా సుప్రియ  ఉంగరం గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి  మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు,మంత్రులు అధికారం అనుభవించినా నార్పల కూతలేరు బ్రిడ్జి వైపు ఎన్నడూ చూడలేదని తాము అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టామని అది కూడా ఏప్రిల్ నెలకు పూర్తి అవుతుందని ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసామని అవి కూడా త్వరలోనే పూర్తి అవుతాయని చెప్పారు. పంచాయతీ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి మనీలా సుప్రియ  ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించ వలసినదిగా కోరారు.మేనిఫెస్టోలో చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల చెంతకే చేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి ఈ గెలుపును బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎవరెన్ని ఆటంకాలు, ఇబ్బందులకు గురిచేసిన ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని నియోజకవర్గంలోని సర్పంచ్ అభ్యర్థుల గుర్తులను గుర్తు పెట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here