Home AP యోగివేమన బ్రహ్మోత్సవాలు

యోగివేమన బ్రహ్మోత్సవాలు

19
0

AP 39TV 18 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా గాండ్లపెంటమండలం లో నేటి నుంచి యోగివేమన బ్రహ్మోత్సవాలు. ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేమన ఆలయం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగివేమన బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అనగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేమన జీవ సమాధి అయిన కటారుపల్లి గ్రామములో ఇక్కడి ఆలయ నిర్వాహకులు వేమన బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మేరకు వేమన ఆలయం ముస్తాబవుతోంది ఆదివారం తెల్లవారుజామున కుంభాభిషేకం. సోమవారం చాందిని బండ్లు మే రమణి మంగళవారం ముట్లూరు తిరణాల, బుధవారం అగ్గి సేవ తదితర కార్యక్రమాలు జరుగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ మూడు రోజుల పాటు జరగనున్న వేమన ఉత్సవాలను తిలగించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం, కడప ,కర్నూలు జిల్లాలకు చెందిన అధిక సంఖ్యలో వేమన ఉత్సాహాలకు హాజరుకానున్నారు. అందుబాటులోకి వచ్చిన టూరిజం భవనాలు ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న టూరిజం భవనాలు సందర్శకులకు అందుబాటులోకి వచ్చాయి. వేమన జీవ సమాధి అయిన కటారుపల్లి లో గతంలో ఏపీ టూరిజం అధికారులు పలు అభివృద్ధి కట్టడాలు చేపట్టారు. ప్రస్తుతం నిరుపయోగం కారంగా ఉన్న విడిది భవనాలు, రెస్టారెంట్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఓ ప్రైవేటు వ్యక్తి అయినా సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హోటల్ నిర్వహిస్తున్నారు. కావున తిరునాళ్లకు వచ్చే సందర్శకులు ఏపీ టూరిజం అధికారులు చేపట్టిన వసతి భవనాలు అందుబాటులో ఉన్నాయి. వసతి భవనాలు కావలసిన వారు ఈ నెంబర్కు సంప్రదించగలరు ,రెస్టారెంట్ నిర్వాహకుడు సయ్యద్ హుస్సేన్. 6302942700 సంప్రదించవలసిన అధికారులు కోరారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here