బదిలీపై వెళుతున్న జేసి నిశాంత్ ను కలిసిన విశ్వేశ్వరరెడ్డి
-ఆత్మీయ సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
ఉరవకొండ:
అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మంగళవారం జేసీ కార్యాలయంలో కలిశారు. ముందుగా శాలువా కప్పి ఆత్మీయంగా జాయింట్ కలెక్టర్ ను విశ్వ సత్కరించారు.గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా నిశాంత్ కుమార్ బదిలీ అవుతుండడతో విశ్వేశ్వరరెడ్డి ఆయనను కలిసారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిశాంత్ దీర్ఘదర్శి అని, ఎలాంటి సమస్యనైనా సానుకూలంగా స్పందించి, సమయస్ఫూర్తితో సమర్థవంతమైన పరిపాలన అందించగలిగిన వ్యక్తిని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమస్యకు పరిష్కారం చూపగల సమర్థవంతమైన అధికారని కొనియాడారు.ప్రజా పంపిణీ వ్యవస్థ ను,రెవిన్యూ సమస్యలను గాడిలో పెట్టడంలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.అనంతరం ఆయనకు వీడ్కోలు చెప్పారు.
