యాభై పాఠశాలలలో వేమన పద్యపోటీలు
వేమన పౌండేషన్, అనంతపురము.
ప్రజాకవి వేమన జయంతి సందర్భంగా జనవరి 19 న వేమన పౌండేషన్, అనంతపురము ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలోని యాబై పాఠశాలలలో వేమన శతక పద్యపోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు పౌండేషన్ అధ్యక్షులు, విశ్రాంత వైస్ ఛాన్సలర్ ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి రెడ్డి , ట్రస్టీలు కోలా వెంకటరమణ, యర్రగుంట కృష్ణారెడ్డి, అబ్దుల్ జలీల్, లోకన్న, జానకి లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పౌండేషన్ గౌరవాధ్యక్షులు, విశ్రాంత డి.జి.పి చెన్నూరు అంజనేయరెడ్డి గారు పద్యపోటీల కార్యక్రమంలో భాగస్వామ్యమైన పాఠశాల నిర్వాహకులు మరియు పద్యపఠన పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
ప్రతి పాఠశాలకు మూడు పథకాలు, ప్రశంశా పత్రాలు, వేమన సాహిత్య పుస్తకాలను బహుమతులుగా అందచేసారు.
అనంతపురం జిల్లాలో ముప్పై పాఠశాలలు, పశ్చిమగోదావరి జిల్లాలో తొమ్మిది, తెలంగాణా నుండి మూడు పాఠశాలలు, చిత్తూరు, కడప,కర్నూలు, కృష్ణా జిల్లాల నుండి పదకొండు పాఠశాలలు మొత్తం యాభై పాఠశాలలు వేమన పద్య పోటీలలో పాల్గొన్నా
విద్యార్థులలలో భాష, సాహిత్యాల పట్ల అభిరుచికి, నైతిక విలువలు పెంపొందించడానికి వేమన పద్యాలు ఎంతో తోడ్పడతాయని భవిష్యత్తులో వందలాది పాఠశాలలలో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తామని పౌండేషన్ ప్రకటించింది.
