పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి మొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఈరోజు అనంతపురంలోని పల్లె రఘునాథ్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పల్లె. వల్లభనేని వంశీ ని అడ్డం పెట్టుకొని మీరు తిట్టిన తిట్లన్నీ వంశీతో తిట్టిస్తున్నారని, ఏదో ఒక రోజు కౌరవులకు పట్టిన గతే మీ ఎమ్మెల్యేలకు పడుతుందని, నేను లోకల్ కాదని చెప్పడానికి నువ్వెవరని, ఎవరు లోకలో, ఎవరు నాన్ లోకల్ లో ప్రజలకు బాగా తెలుసని, దమ్ముంటే వల్లభనేని వంశీ మాకు సంబంధం లేదని మీ ముఖ్యమంత్రితో చెప్పించగలరా? అని పల్లె సవాల్ విసిరారు. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని, వచ్చేఎలక్షన్స్ లో అడ్రస్ లేకుండా పోతావని శ్రీధర్ రెడ్డి పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది నేనేనని, మీ పార్టీలో ఎంతమంది బరిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకో మని, మా పార్టీ తరఫున నేనొక్కడే సింహం మాదిరి సింగిల్ గా వస్తానని సవాల్ విసిరారు.
