జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై అనంతలో ప్రదర్శన
▪️సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన విద్యార్థులు
▪️కొత్త జిల్లాలతో ప్రజలకు సత్వర సేవలు సాధ్యం
▪️వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి
పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసమే అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టారని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతరెడ్డి తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ శనివారం అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్ కళాశాలలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్రదర్శనగా నిలబడి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని విద్యార్థులు అన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యను పేదలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దని కొనియాడారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలు తమకు ఎంతగాయో ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. దిశ చట్టం తీసుకొచ్చి తమకు రక్షణ కల్పించారని తెలిపారు. నాడు–నేడు కింద స్కూళ్లు, కళాశాలల రూపురేఖలు మారుస్తున్నారని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం నేత విజయ్ కుమార్ మాట్లాడుతూ 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉండేదన్నారు. కానీ సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకురావడంతో ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. కొత్త జిల్లాల వద్ద పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. అధికార యంత్రాంగం ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతికేరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు విజయ్ కుమార్‌రెడ్డి, వినయ్‌కుమార్, దాదు, రాధాకృష్ణ, వీరాంజనేయులు, అమర్నాథ్‌రెడ్డి, విద్యాతదితరులు పాల్గొన్నారు.
