Home AP M L C అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా కండించిన తెలుగుదేశం పార్టీ

M L C అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా కండించిన తెలుగుదేశం పార్టీ

4
0

M L C అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా కండించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జే యల్ మురళీధర్

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము . అశోక్ బాబు ను అర్థరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి ?:
ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్థ రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం దారుణం , అమానుషం , దుర్మార్గం .అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జే యల్ అన్నారు .

*పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయన్ను విజయవాడలో అరెస్ట్‌ చేయడం కక్షసాధింపు చర్యలో భాగమే అయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము .
తప్పుడు ప్రచారాలతో అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి.. అరాచకంతో దుర్మార్గ పాలన సాగిస్తున్నారు .
** వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో ‎వేధిస్తున్నారు .ఇవి ఏవి తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను ఆపలేవన్నారు జే యల్ .

గతంలో అశోక్ బాబుపై వచ్చిన విద్యార్హతల ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోంది.

**ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష్యసాధిస్తున్నారు.
అక్రమ కేసులకు భయపడేవారెవరూ టీడీపీలో లేరు.

**అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇకనైనా పద్దతి మార్చుకుని పాలన సాగించాలి.. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జే యల్ . మురళీధర్ హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయల్ మురళి ,వద్దే వేంకటాద్రి ,vg లోకనాథ్ ,అనిల్ నాయుడు , మాధవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here