గుడిలోకి దళితులను అనుమతించాలి లేకుంటే చర్యలు తీసుకోండి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం
నార్పల మండలం, గుంజేపల్లి గ్రామంలో అగ్రవర్ణ కులాలు, ఎస్సీల మధ్య రాముల స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్లనివ్వటం లేదని గ్రామానికి చెందిన దళితులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకొచ్చారు. స్పదించిన ఎమ్మెల్యే కులవివక్షతతో చూస్తూ గుడిలోకి రానివ్వకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని దళితులను గుడిలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు.
దళితుల పట్ల కులవివక్షత చూస్తే సహించేదె లేదని హెచ్చరించారు.
