Home AP 50 సంవత్సరాలు దాటిన ప్రతీ రజక కార్మికులకు సామాజిక ఫెక్షన్ ఇవ్వాలి.

50 సంవత్సరాలు దాటిన ప్రతీ రజక కార్మికులకు సామాజిక ఫెక్షన్ ఇవ్వాలి.

5
0

రజకులకు రక్షణ చట్టం కల్పించాలి, 50 సంవత్సరాలు దాటిన ప్రతీ రజక కార్మికులకు సామాజిక ఫెక్షన్ ఇవ్వాలి.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు
రజక చైతన్య సేవాసంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు డిమాండ్———-

ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవాసంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు  24-1-22 సోమవారం ఉదయం 11 గంటలకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో కాకినాడ రామారావు మాట్లాడుతూ రజకుల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రజక వృత్తి చెరువులు దోబీ ఘాట్ స్థలాలు పైన రజకులకు పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రజకులను ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రజకులకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తే ఈ ప్రభుత్వం 50 యూనిట్లు ఇస్తామని అది కూడా అర్థం కాని కేటగిరిలో రజకులను అధికారుల చుట్టూ తిప్పుతుందని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన విధంగా 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని
రజక వృత్తిదారుల అందరికీ ఇళ్ల దగ్గర వృత్తి చేసే వారందరికీ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా తన చేదోడు పథకం పదివేల రూపాయలు వెంటనే అందరికీ ఇవ్వాలని. రజకుల భద్రతకు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని
గీత చేనేత వృత్తి దారులకు ఇచ్చిన విధంగా 50 సంవత్సరాలు పూర్తయిన రజకులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఇల్లు లేని రజకులకు అందరికీ లో స్థలాలు కేటాయించి పక్క ఇల్లు కట్టి ఇవ్వాలని, రజక కార్పొరేషన్ కి కనీసం (వెయ్య ) 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి కుటుంబానికి 90 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ధోబి పోస్టులు భర్తీ చేసి రజక యువతీ యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రజక వృత్తి లో ఉన్నటువంటి వృత్తిదారులకు అధునాతన యంత్రాలు ఏర్పాటు చేసి దోబీ ఘాట్లు కట్టి ఇవ్వాలని వృత్తిదారులకు సంక్షేమ పథకాలు వర్తించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరినాడు. రజకుల అందరూ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలను బలోపేతం చేసి మరింత గట్టిగా పని చేద్దామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here