శిద్ధరాంపురం పోలీసు ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఐజిపి & కర్నూలు రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీలు
* ఇళ్ల స్థలాల అభివృద్ధిపై సమీక్ష… మౌలిక సదుపాయాల కల్పన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఐజిపి
బుక్కరాయసముద్రం మండలం శిద్ధరాంపురం గ్రామ సమీపంలో ఉన్న పోలీసు ఇళ్ల స్థలాల ప్రాంతాలను ఐజిపి & కర్నూలు రేంజ్ డి.ఐ.జి వెంకట్రామిరెడ్డి IPS , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS పరిశీలించారు. ఇళ్ల స్థలాల ప్రాంతంలోని అభివృద్ధిపై సమీక్ష చేశారు. రహదారులు, మురికి కాలువలు, తాగునీరు, తదితర మౌలిక వసతులపై దృష్టి పెట్టడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, బుక్కరాయసముద్రం సి.ఐ సాయి ప్రసాద్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , శ్రీనివాసుల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
