Home AP మండల కేంద్రంలో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని సర్పంచ్ కు దళిత నాయకులు వినతి పత్రం

మండల కేంద్రంలో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని సర్పంచ్ కు దళిత నాయకులు వినతి పత్రం

418
0

*మండల కేంద్రంలో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని సర్పంచ్ కు దళిత నాయకులు వినతి పత్రం అందజేశారు*

AP39TV NEWS ఫిబ్రవరి 6

గుడిబండ:- మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ గుడిబండ మండలం దళిత నాయకులు స్థానిక సర్పంచ్ జిబి కర్ణాకర్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల దళిత నాయకుల ఐక్యమత్యంతో మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చేయాలనే సదుద్దేశంతో ఉన్నామని అందువలన గుడిబండ బస్టాండ్ వద్ద రెండు సెంట్లు స్థలం కేటాయించాలని కోరుతున్నామని తెలిపారు మరియు సర్పంచ్ జిబి కర్ణాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయుటకు స్థల సేకరణ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గౌరవ సలహాదారులు మాజీ ఎంపీపీ ఎల్ కె నరసింహప్ప మాజీ సర్పంచ్ ఈరలక్కప్ప శ్రీరామప్ప బి నాగరాజు సర్పంచ్ లు లక్ష్మీనారాయణ తిప్పేస్వామి AP39TV రిపోర్టర్ కొంకల్లు శివన్న వీఆర్ఏ నరసింహమూర్తి బీఎస్పీ సోమన్న జగదీష్ హనుమంతరాయుడు నరసింహరాజు మంజునాథ్ మహేష్ సీసీ గిరి మంజునాథ్ శ్రీకాంత్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV NEWS
మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here