Home AP దయచేసి ఎవరూ బయటకు రావద్దు – శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

దయచేసి ఎవరూ బయటకు రావద్దు – శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

16
0

AP 39TV 01మే 2021:

అన్నచెల్లెల్లు, అక్కతమ్ముళ్ళు, అమ్మనాన్నలు..నా శింగనమల నియోజకవర్గంలోని అందరికి చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే.. దయచేసి ఇళ్ళల్లోంచి ఎవరూ బయటకు రావద్దని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి  ప్రజలందరిని కోరారు.కరోనా విలయతాండవానికి కొందరు చిన్న వయసులోనే అశువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని కోరారు. ముఖ్యంగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి .. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి..సామాజిక దూరం పాటించాలి.. ఇవన్నీ విధిగా చేసి కరోనా మాహమ్మరి రక్కసి కోరల నుంచి బయట పడాలని కోరారు. ఒకవైపు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి  ప్రజలకు ఈ సంక్షోభ సమయంలో ఎలా సహాయపడేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. బయట పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇళ్లలోనే ఉండమని ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను అని కరోనా తీవ్రతను ప్రజలకు వివరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here