నూతన విద్యా విధానం పై ప్రజల్లో అవగాహన తేవాలి*
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నూతన జాతీయ విద్యా విధానం – 2020, తదితర అంశాలపై సలహాలు, సూచనలు అందించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శంకర్ నారాయణ తోపాటు ప్రభుత్వ శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, అనంతపురం, ధర్మవరం, కదిరి ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, సిద్ధారెడ్డి, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఏ. సిరి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం – 2020 వల్ల గ్రామాల్లో డ్రాపౌట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా చూడాలి. నూతన జాతీయ విద్యా విధానం ఎందుకు అమలు చేస్తున్నాం అనేది ప్రజలకి అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని విధానాన్ని అమలు చేయాలి. జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకు వచ్చింది, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ప్రమేయం ఉంటుంది అనేది అందరికీ తెలియజేసి ఈ విధానాన్ని బాగా అమలయ్యేలా చూడాలి. జాతీయ విద్యా విధానాన్ని విజయవంతంగా అమలు చేసేలా ముందుగానే అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలి. ఇందుకు మా వంతు సహకారం అందిస్తామన్నారు.
