తెదేపాఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 26 వ వర్ధంతి వేడుకలు
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశంపార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతి వేడుకలు ధర్మవరం పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్న తెదేపా శ్రేణులు ఈ సందర్భంగా ధర్మవరం పట్టణ ప్రధాన కూడళ్లయిన ఎన్టీఆర్ సర్కిల్,కొత్తపేట ఉషోదయ స్కూల్ సర్కిల్,పల్లవి థియేటర్ సర్కిల్ లలో గల ఎన్టీఆర్ విగ్రహాలకు తెదేపా శ్రేణులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ, పార్టీస్థాపించిన అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి, పేదలకు ప్రధాన అవసరమైన కూడు-గూడు-గుడ్డ నినాదంతో రెండు రూపాయలకే కిలో బియ్యం-ఎన్టీఆర్ పక్క ఇల్లు-జనతా వస్త్రాలను
పేదలకు అందించిన మహాను భావుడు నందమూరి తారకరాముడుఅని తను తనువు చాలించే వరకు పేదల అభ్యున్నతికోసం పరితపించిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని
మహిళలకు ఆస్తి హక్కులో సగభాగం కల్పించిన మహిళా పక్షపాతి ఎన్టీఆర్ అని అటు వంటి మహానుభావుడు మనమధ్య దూరమైన పేదప్రజల గుండెల్లో గుడికట్టుకొన్న మహోన్నతమైన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన 26 వ వర్ధంతిని పురస్కరించుకొని సేవాకార్యక్రమాలలో భాగంగా గొట్లూరులో ఉన్న అనాధ శరణాలయంలో పేదలకు అన్నధానం చేయడం జరిగిందని ఎన్టీఆర్ స్పూర్తితో తెదేపా ఆధ్వర్యంలో భవిష్యత్తు లో మరెన్ని సేవా కార్యాక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెదేపా నాయకులు తెలియజేశారు.
