Home AP అధికారులకు ఎమ్మెల్యే అనంత ఆదేశం

అధికారులకు ఎమ్మెల్యే అనంత ఆదేశం

4
0

బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయండి

అధికారులకు ఎమ్మెల్యే అనంత ఆదేశం

బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ కాలనీ వద్ద సాగుతున్న బ్రిడ్జ్ పనులను నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ హుస్సేన్ తో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ కాలనీ బ్రిడ్జ్ తో పాటు రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య తగ్గించ వచ్చునని అభిప్రాయ పడ్డారు. బ్రిడ్జ్,రోడ్డు నిర్మాణం పనులను నాణ్యత లోపించకుండా చేపట్టాలని ఆదేశించారు. అంతకుమునుపు రాజీవ్ కాలనీ వాసులు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ని కలిసి బ్రిడ్జ్,రోడ్డు నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజీవ్ కాలనీ ఉప సర్పంచ్ మసూద్,పంచాయతీ సెక్రటరీ అశోక్ బాబు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనకొండ్ల అంజి,బాబు,ఓబులేసు, డి.రహీం,మారేన్న తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here