హబీబ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అనంత…
అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు హబీబ్ మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం గుల్జార్ పేట లోని హబీబ్ నివాసం కు మేయర్ వసీం,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య లతో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వెళ్లి హబీబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హబీబ్ సతీమణి హాబీదా తో మాట్లాడుతూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని,మేము అందరం ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముంతాజ్ భేగం,వైసిపి నాయకులు ఖాజా,ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
