Home AP టెన్నిస్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్ వసీం.

టెన్నిస్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్ వసీం.

9
0

క్రీడలతోనే ఉన్నతస్థాయికి.

టెన్నిస్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్ వసీం.

అనంతపురం.
క్రీడలతోనే ఉన్నతస్థాయికి చేరేందుకు అవకాశం ఏర్పడుతుందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.నగర పరిధిలోని రుద్రంపేట బైపాస్ వద్ద నారాయణ టెన్నిస్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్యాప్ టెన్నిస్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్ వసీం మంగళవారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులలోని నైపుణ్యం కలిగిన వారిని వెలికి తీసే ప్రయత్నం చేసిన నిర్వాహకులు చేయడం అభినందనియమన్నారు.క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,యువ క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారని సూచించారు.క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ఎప్పుడూ గెలుపు ఓటములను క్రీడా స్పూర్తితో తీసుకోవాలన్నారు.ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.ఎంతో మంది గ్రామీణ స్థాయి నుండి క్రీడలలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకున్నారని యువ క్రీడాకారులు వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని,ఉద్యోగాల నియామకాలలో సైతం క్రీడా సర్టిఫికేట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నందన జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.క్రీడాకారుల అభిరుద్దికి తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు.కార్యక్రమంలో టౌర్ని నిర్వాహకులు నారాయణ, కార్పొరేటర్ లు అనీల్ కుమార్ రెడ్డి, కమల్ భూషణ్,వైసీపీ నాయకులు కొండ్రేడ్డి ప్రకాష్ రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి తోపాటు క్రీడాకారులు, కోచ్ లు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here