సమాజంలో నేత్రదానం పై అవగాహన కలిగించాలి
మేయర్ మహమ్మద్ వసీం
అనంతపురం.
నేటి సమాజంలో నేత్రదానం పై అవగాహన కలిగించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వం తో పాటు స్వచ్చంద సంస్థలపై కూడా ఉందని మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. ఇటీవల మృతి చెందిన నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ నవనీత కృష్ణ నేత్ర దానం చేయడం పట్ల సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అందించిన ప్రశంసా పత్రాన్ని మేయర్ వసీం నవనీత కృష్ణ కుటుంబీకులకు అందించారు.బుధవారం మేయర్ ఛాంబర్ లో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ వసీంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాద్యక్షుడు అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణ సతీమణిని వారు సత్కరించారు.ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మరణాంతరం తమ నేత్రాలను దానం చేయడం వలన మరో ఇద్దరికీ చూపు కలిగించడంతో పాటు రెండు కుటుంబాలను పరోక్షంగా ఆదుకోవచ్చునన్నారు.నవనీత కృష్ణ కూడా మునిసిపల్ కార్పొరేషన్ ద్వార నేత్రదానం చేసిన రెండవ వ్యక్తి గా గుర్తింపు పొందాడని మునిసిపల్ ఉద్యోగులందరితోను నేత్రదానం కు ఒప్పించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మునిసిపల్ ఉద్యోగుల కొరకు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సాయి ట్రస్ట్ అద్యక్షుడు విజయ సాయి కుమార్ కు మేయర్ సూచించారు..కార్యక్రమంలో కార్పొరేటర్లు లీలావతి, బాలాంజినేయులు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు,అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి, రుద్ర కనష్ట్రక్షన్ అనిల్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి నాయకులూ దాదు,సాయి ట్రస్ట్ సభ్యులు నారాయణ నాయక్, రాఘవేంద్ర, ఎల్.వి ప్రసాద్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
