రైతాంగ ఉద్యమ విజయం స్ఫూర్తితో కార్పొరేట్ అనుకూల, ఫాసిస్టు శక్తుల నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడుదాం. *PDSU అనంతపురం జిల్లా
అనంతపురం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ నాగ లింగారెడ్డి గారు, వైస్ ప్రిన్సిపాల్ గారి తో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు జిసి. ప్రకాష్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని, జార్జిరెడ్డి, జంపాల లాంటి విద్యార్థి అమరవీరుల బాట లో విద్యారంగ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్, టౌన్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ ,శ్రీహరి, సభ్యులు కుమార్, లత, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
