Home AP తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే హౌస్ బ్రేకర్ అరెస్టు

తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే హౌస్ బ్రేకర్ అరెస్టు

21
0

తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే హౌస్ బ్రేకర్ అరెస్టు

* రూ. 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు నగలు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
* ఒకే ఒక్కడు… 29 ఇళ్లల్లో దొంగతనాలు

తాళం వేసిన ఇళ్లల్లో సులువుగా చోరీలకు పాల్పడే హౌస్ బ్రేకర్ ను అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుండీ రూ. 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు నగలు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, తదితర వ్యసనాలకు బానిసై వాటిని తీర్చుకునే క్రమంలో దొంగగా అవతారమెత్తినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత ఏడాది జనవరి నెల నుండీ ఇప్పటి వరకు అనంతపురం, చుట్టుపక్కల ప్రాంతాలలోని 29 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

** అరెస్టయిన హౌస్ బ్రేకర్ వివరాలు:

* ఉప్పర ఆది శ్రీనివాసులు @ శీను, వయస్సు 25 సం.లు, ఉప్పరపల్లి గ్రామం, అనంతపురము మండలం.

** స్వాధీనం చేసుకున్నవి:

* రూ. 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు నగలు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు, ఇనుప రాడ్లు

** నేపథ్యం:

ప్రస్తుతం అరెస్టయిన ఉప్పర ఆది శ్రీనివాసులు @ శీను బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పేకాట, తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. బేల్దారి పని మానేసి పేకాటలో మునిగిపోయి అప్పులు పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చేందుకు డబ్బులు సంపాదించాలని భావించాడు. దొంగతనాల ద్వారా సులువుగా అప్పులు తీర్చుకోవచ్చని నిర్ణయించి గత ఏడాది జనవరి నుండీ హౌస్ బ్రేకింగ్ లు మొదలు పెట్టాడు. అనంతపురం, పరిసర ప్రాంతాలలోని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశాడు. ఎవరు లేని సమయంలో వెంట తీసికెళ్లిన రాడ్ ద్వారా తాళాలు పగల గొట్టి ఇంట్లోకి చొరబడేవాడు. ఇంట్లో దాచిన బంగారు నగలు, విలువైన వస్తువులను దోచుకెళ్లే వాడు. ఇలా దొంగలించిన బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురమ్, కోసమట్టం ఫైనాన్స్ లలో కుదువ బెట్టి, డబ్బులు తీసుకొని పేకాట మరియు జల్సాలకు ఖర్చు పెట్టేవాడు. ఇలా…అనంతపురము నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 10, అనంతపురము ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 3 , అనంతపురము రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిదిలో 3 , అనంతపురము రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 7 , రాప్తాడు పోలీసు స్టేషన్ పరిధిలో 5 , ఆత్మకూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో హౌస్ బ్రేకింగ్ లకు పాల్పడ్డాడు.

** అరెస్టు… జిల్లాలో దొంగలు, కన్నపు నేరాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాలు మేరకు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సై లు జమాల్ బాషా, గంగాధర్, చంద్రశేఖర్, రంగ స్వామి ఆధ్వర్యంలో ASI-షేక్షావలి, హెడ్ కానిస్టేబుళ్లు మల్లిరెడ్డి, భాస్కర్ నాయుడు, శంకరప్ప, కానిస్టేబుళ్లు పవన్ కుమార్, అనీల్ నాయక్, షాషావలి, C.T రాజన్న, శ్రీనాథ్, జయరాం, పాండవ, వెంకటరమణ, వి.పి రాజన్న లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పక్కాగా రాబడిన సమాచారంతో ఈ దొంగను స్థానిక రుద్రంపేట సర్కిల్ వద్ద అరెస్టు చేశారు.

** ప్రశంస: అనంతపురం, పరిసర ప్రాంతాలలోని 29 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన దొంగను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సై లు జమాల్ బాషా, గంగాధర్, చంద్రశేఖర్, రంగ స్వామి ఆధ్వర్యంలో ASI-షేక్షావలి, హెడ్ కానిస్టేబుళ్లు మల్లిరెడ్డి, భాస్కర్ నాయుడు, శంకరప్ప, కానిస్టేబుళ్లు పవన్ కుమార్, అనీల్ నాయక్, షాషావలి, C.T రాజన్న, శ్రీనాథ్, జయరాం, పాండవ, వెంకటరమణ, వి.పి రాజన్నల బృందాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS అభినందించారు…….

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here