డ్రైనేజీల అభిరుద్దిపై దృష్టి సారించండి.
నగర మేయర్ మహమ్మద్ వసీం
అనంతపురం
డ్రైనేజీల అభిరుద్దిపై దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు.నగరంలోని 32 వ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీ లో బుధవారం మేయర్ వసీం డిప్యూటీ మేయర్లు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య లతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లో డ్రైనేజీలు డ్యామేజీ అయ్యి రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండటంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయలేకపోవడం వంటి సమస్యలను స్థానికులుమేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరితగతిన ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా డివిజన్ లో నిరుపయోగంగా మారిన పార్క్ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.ఈ సందర్భంగా డివిజన్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో మేయర్ ,డిప్యూటీ మేయర్ లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షణ చేయాలని సూచించారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్ భూషణ్,అనీల్ కుమార్ రెడ్డి,ఈఈ రామ్ మోహన్ రెడ్డి, కార్యదర్శి సంగం శ్రీనివాసుల ,డి ఈ లు రాంప్రసాద్ రెడ్డి, చంద్ర శేఖర్, నాయకులు శీనా,శోబారాణి, కుమార్, కిరణ్,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
