Home AP భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి – ఎంపీ తలారి రంగయ్య

భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి – ఎంపీ తలారి రంగయ్య

10
0

AP 39TV 06 మే 2021:

‘‘కరోనా బాధితులు ఎవరూ భయపడొద్దు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’’ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య  భరోసా ఇచ్చారు.  అనంతపురం సర్వజనాస్పత్రిలోని కోవిడ్‌ వార్డులను సూపరడెంట్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఐసీయూ, ఛెస్ట్, ఎఫ్‌ఎం, ఆర్థో వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అటు వైద్య సిబ్బంది, ఇటు కోవిడ్‌ బాధితులను ఎంపీ తలారి రంగయ్య  అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌తో ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here