చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతుల్లేవు
— జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
పీఆర్సీ సాధన కమిటీ రేపు చేపట్టాలనుకున్న చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు గుమిగూడటం వల్ల కరోన విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఆ కార్యక్రమానికి వెళ్లొద్దని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేసి ఉద్యోగులు మరియు సంఘాల నేతలకు సూచిస్తున్నారు.
