ఈనెల 23 న భవన నిర్మాణ కార్మికుల మహాసభలకు ఏర్పాట్లు సిద్ధం
,
సంఘం నాయకులతో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కన్వీనర్ ఎ. రామమోహన్.
కడప జిల్లా మైదుకురులో ఈనెల 23 న జరిగే భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, జిల్లా వ్యాప్తంగా కార్మికులు తరలిరావాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ కడప జిల్లా కన్వీనర్ ఎ. రామమోహన్ పిలుపునిచ్చారు.
మంగళ వారం నాడు మైదుకురులో మహాసభలు ఏర్పాట్లపై సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలో సుబ్బరాయుడు అధ్యక్షతన సమావేశం ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ ఈనెల 23న మైదుకూరు లో నంద్యాల రోడ్డులో ఉన్న డిఎస్పీ ఆఫీస్ వెనక వైపు ఉన్న డివిజనల్ విద్యుత్ కార్యాలయం ఆవరణలో భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ మహాసభలకు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వి నరసింహారావు విజయవాడ నుండి హాజరువుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
గత కొద్ది రోజులుగా కార్మికులకు పనిలేక పస్తులుంటున్నారని, వారందరికీ ప్రభుత్వం తక్షణమే 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని , అందరికి గుర్తింపు కార్డులను అందజేయలని, ఇసుకను ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచాలని, సిమెంట్ , ఇతర ముడి సరుకుల ధరలు తగ్గించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో వున్న నిధులను కార్మికులకు మాత్రమే ఖర్చు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.
కావున జిల్లా లో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరయి మహాసభల విజయవంతానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు షరీఫ్, గురయ్య, థామస్, మీరవలి, ఓబులేసు, దేవా , బాలుడు, భీముడు, రాయప్ప, ఓబయ్య. జహంగీర్ బాషా, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
