అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి, మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ కి మరియు కమిషనర్కి వినతి పత్రం అందజేసిన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు మరియు జిల్లా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు విషయం నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన సెలూన్ షాపులకు మున్సిపాలిటీ వారు ట్రేడ్ లైసెన్సులు కట్టమని డిమాండ్ నోటీసులు షాపులకు ఇచ్చారు ఈ విషయంపై ఎమ్మెల్యే తో,మేయర్ తో, కమిషనర్ తో విషయం తెలియజేస్తూ గతంలో ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ నాయిబ్రాహ్మణుల సెలూన్ షాప్ లకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవో కూడా ఉన్నది ఈ జీవో మునిసిపాలిటీ వారు దగ్గర లేనందువల్ల ఈ డిమాండ్ నోటీసు ఇస్తున్నారు మాకు జీవో కాఫీ ఉన్నది అందువల్ల మినహాయింపు సెలూన్ షాపులకుఇవ్వాలని వాళ్లకి తెలియజేయడం జరిగింది వాళ్లు వెంటనే స్పందించి త్వరలోనే అమలు లోకి తీసుకొని వస్తామని ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఎవరు ఆందోళన చెందవద్దని దీనిని త్వరలోనే అమలు అయ్యేటట్లు చేస్తానని తెలిపాడు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు జి ఎం విజయ భాస్కర్ శివ కుమార్ బంకు శీనా బయన్న నగేష్ అనిల్ ఇందిరా నగర్ శివ ఇందిరా నగర్ సూరి శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.
