Home AP రైతుల ఉద్యమానికి సంఘీభావంగా “కిసాన్ జ్యోతి” కార్యక్రమం

రైతుల ఉద్యమానికి సంఘీభావంగా “కిసాన్ జ్యోతి” కార్యక్రమం

10
0

నూతన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దుచేయాలని, ఢిల్లీ లో జరుగుతున్న భారత రైతుల ఉద్యమానికి సంఘీభావంగా “కిసాన్ జ్యోతి” కార్యక్రమంలో భాగంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి పిలుపు మేరకు కల్లూరు మండలంలో చెన్నమ్మ సర్కిల్ లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శరత్ కుమార్, ఏఐవైఎఫ్ నగర ఉపాధ్యక్షులు చంటి, గిరిజన సమాఖ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.రవి,కల్లూరు మండల రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here